ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ట్రాన్స్‌కో, డిస్కంల్లో 6 నెలలపాటు సమ్మెలు నిషేధం - ఏపీ ట్రాన్స్​కో లో సమ్మెలు నిషేధం న్యూస్

ట్రాన్స్​కో, డిస్కంల్లో 6 నెలలపాటు సమ్మె నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ban on strikes in power transmission companies
ban on strikes in power transmission companies

By

Published : Apr 16, 2020, 7:47 PM IST

ఏపీ ట్రాన్స్‌కోతో పాటు విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఆరు నెలల పాటు సమ్మెలను నిషేధిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, ఏపీ సీపీడీసీఎల్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు 6 నెలల పాటు సమ్మెకు వెళ్లకుండా నిషేధాజ్ఞలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఎసెన్షియల్ సర్వీసెస్ నిర్వహణ చట్టం 1971( ఎస్మా)లోని సెక్షన్ 3 ప్రకారం మూడు విద్యుత్ పంపిణీ సంస్థల్లోనూ సమ్మెలను ఆరు నెలల పాటు నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాప్రయోజనాల రీత్యా విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు కలగకుండా సమ్మెలను నిషేధిస్తున్నట్టు ఇంధన శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details