Balatripurasundari Devi : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మొదటిరోజు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనం ఇచ్చిన అమ్మవారు నేడు బాలత్రిపురసుందరిదేవిగా కొలువుదీరారు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రిపై బాలాత్రిపురసుందరీదేవి రూపం - దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
Dussehra At Vijayawada : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై బాలాత్రిపురసుందరీదేవిగా అమ్మవారు కొలువుదీరారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి దుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు.
Balatripurasundari Devi
వృద్ధులు, దివ్వాంగులకు నేటి నుంచి దర్శనానికి ప్రత్యేక సమయాన్ని ఆలయ కమిటీ కేటాయించింది. ప్రతిరోజు ఉదయం 10 నుంచి 12 వరకు, సా. 4 నుంచి 6 వరకు దర్శనాన్ని కేటాయించారు. అక్టోబర్ 2న మినహా ఇతర రోజుల్లో వృద్ధులు, దివ్యాంగులకు దర్శనం కల్పించనున్నారు.
ఇవీ చదవండి: