లవకుశ సినిమాలో లవుడిగా నటించిన నాగరాజు తనకెంతో ఇష్టం అని బాలకృష్ణ తెలిపారు. ఆయన హఠాత్తుగా మరణించడం ఎంతో బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాగరాజు మృతి వ్యక్తిగతంగా లోటని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
సినీ ప్రముఖుల మృతి బాధాకరం: బాలకృష్ణ - నటుడు జయప్రకాశ్ మృతి వార్తలు
సినీ ప్రముఖులు లవకుశ నాగరాజు, జయప్రకాష్ రెడ్డి ల మృతి పట్ల నందమూరి బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాను లెక్కలేనన్ని సార్లు చూసిన సినిమా లవకుశ అని తెలిపారు.
balakrishna mourning for jayaprakash death
ఎన్నో మంచి పాత్రలతో మెప్పించిన విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి మృతి విచారకరమని బాలకృష్ణ సంతాపం తెలిపారు. ఆయన మృతి పరిశ్రమకు తీరని లోటన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ జయప్రకాష్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.