ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Balakrishna: నన్ను కలిసేందుకు రావొద్దు: బాలకృష్ణ

పుట్టిన రోజున తనను కలిసేందుకు ఎవరూ రావొద్దని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ(Balakrishna).. అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి సంవత్సరం జూన్ 10న తనను కలిసేందుకు వస్తున్న అభిమానులకు విధేయుడినని చెప్పారు. కరోనా వేళ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

balakrishna
balakrishna

By

Published : Jun 7, 2021, 6:10 PM IST

తన పుట్టినరోజు (జూన్ 10)న శుభాకాంక్షలు తెలిపేందుకు ఎవ్వరూ రావొద్దని సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఏటా పుట్టినరోజు (birthday)న తనను కలిసేందుకు తరలివస్తున్న అభిమానులకు సర్వదా విధేయుడినని చెప్పారు. కరోనా విలయతాండవం చేస్తోన్న ఈ విపత్కర పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు. అభిమానుల ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్షలు లేవన్న బాలకృష్ణ.. విపత్కాలంలో అసువులు బాసిన అభిమానులు, కార్యకర్తలకు నివాళులర్పించారు.

ABOUT THE AUTHOR

...view details