ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'బహుజనులు అధికారంలోకి వస్తే.. మార్పు ఖాయం' - బహుజన్​ మాక్​ అసెంబ్లీ తాజా వార్తలు

విజయవాడలోని బసవపున్నయ్య భవన్​లో బహుజన మాక్ అసెంబ్లీ కార్యక్రమం జరిగింది. బహుజనులు రాష్ట్ర పగ్గాలు చేపడితే వచ్చే మార్పులకు నిదర్శనంగా కార్యక్రమం నిర్వహించినట్టు నిర్వాహకులు పరమశివన్ చెప్పారు.

bahujan mock assembly
bahujan mock assembly

By

Published : Jan 27, 2021, 2:17 PM IST

బహుజనులు అధికారంలోకి వస్తే ఎటువంటి అభివృద్ధి పనులు చేపడతారన్నది తెలిపేందుకు.. మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు బహుజన నేత పరమశివన్ తెలిపారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా అధిక సంఖ్యాకులు ఉన్న బహుజనులు రాష్ట్ర పగ్గాలు చేపడితే మార్పు ఖాయమన్నారు. విజయవాడలోని బసవపున్నయ్య భవన్​లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

అసెంబ్లీని పోలి ఉండే విధంగా ఏర్పాట్లు చేసి... కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలుగా ఇందులో పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ నిర్ణయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పరమశివన్​ తెలిపారు. నూతన ఆలోచనలతో ప్రభుత్వాన్ని ఏవిధంగా నడిపించాలన్నదీ మాక్ అసెంబ్లీలో చర్చించామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details