ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: సినీ హీరో సచిన్ జోషికి బహదూర్​పుర పోలీసుల నోటీసులు - case filed on hero sachin joshi

నిషేధిత గుట్కాల సరఫరా కేసులో నిందితుడిగా ఉన్న సినీహీరో, నిర్మాత సచిన్​ జోషికి బహదూర్​పుర పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో తన అడ్వొకేట్ ద్వారా వివరణ ఇస్తానని సచిన్ స్పష్టం చేశారు.

హీరో సచిన్ జోషి
హీరో సచిన్ జోషి

By

Published : Oct 15, 2020, 9:57 PM IST

నిషేధిత గుట్కా సరఫరా కేసులో నిందితుడిగా ఉన్న సినీ నటుడు, నిర్మాత సచిన్ జోషికి హైదరాబాద్​లోని బహదూర్​పుర పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 13న పీఎస్​కు వచ్చిన సచిన్.. నోటీసులు తీసుకుని వెళ్లి వారంలోగా తన అడ్వొకేట్ ద్వారా వివరణ ఇస్తానని స్పష్టం చేశారు.

ఈ ఏడాది మార్చి 3న బహదూర్​పుర పీఎస్​ పరిధిలో గుట్కా విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి జహంగీర్, జబ్బార్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2 లక్షలు విలువచేసే గుట్కాను సీజ్ చేశారు. నిందితులను విచారించగా.. ఠాకూర్ సింగ్ అనే వ్యక్తితో పాటు గోవా గుట్కా ఉత్పత్తి సంస్థ యజమాని సచిన్ జోషిని కూడా నిందితులుగా చేర్చారు. మహారాష్ట్రంలో ఉంటే సచిన్​ జోషికి నోటీసులిచ్చేందుకు బహదూర్​పుర పోలీసులు అక్కడి వెళ్లగా.. నోటీసులు తీసుకునేందుకు సచిన్ స్వయంగా బహదూర్​పుర పీఎస్​కు వచ్చారు.

ఇదీ చదవండి: కారుణ్య నియామకం కోసం వస్తే… కీచక పర్వం కొనసాగిస్తున్నాడు..!

ABOUT THE AUTHOR

...view details