ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కిలాడీ లేడీ.. పెళ్లి పేరుతో రూ.11కోట్లు లూటీ - Shruti Sinha arrested for looting Rs 11 crore

ఐపీఎస్‌ అధికారినంటూ మోసం చేసిన శ్రుతిసిన్హాను హైదరాబాద్ బాచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లి పేరుతో ఓ వ్యక్తి వద్ద నుంచి ఏకంగా రూ.11 కోట్లు వసూలు చేసింది.

duplicate IPS Shruti Sinha arrest
కిలాడీ లేడీ.. పెళ్లి పేరుతో రూ.11కోట్లు లూటీ

By

Published : Feb 24, 2021, 3:01 PM IST

హైదరాబాద్​లో నకిలీ ఐపీఎస్‌ అధికారినంటూ మోసం చేసిన శ్రుతిసిన్హా అరెస్టు అయింది. నిందితురాలిని బాచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వీరారెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.11 కోట్లను శ్రుతి సిన్హా కొల్లగొట్టింది. తన చెల్లితో వీరారెడ్డి సోదరుడికి వివాహం జరిపిస్తానని చెప్పి... పెళ్లి పేరుతో వీరారెడ్డి వద్ద రూ.11 కోట్లు వసూలు చేసింది. బంధువు విజయ్‌కుమార్ రెడ్డితో కలిసి శ్రుతి మోసం చేసింది.

వసూలు చేసిన డబ్బుతో ఖరీదైన కార్లు కొనుగోలు చేసింది. మోసపోయానని గ్రహించిన వీరారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు విషయం తెలిసి శ్రుతి బంధువు విజయ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. మోసం కేసులో మహిళకు సహకరించిన ముగ్గురిని బాచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి వద్ద 3 కార్లు, రూ.6 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాలు.. డబ్బులు వసూలు చేస్తున్న కేటుగాళ్లు

ABOUT THE AUTHOR

...view details