గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జీగా బాధ్యతలు తీసుకున్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడును సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అభినందించారు. విజయవాడలోని యనమల నివాసంలో ఆయన్ని బచ్చుల అర్జునుడు కలిశారు.
గన్నవరంలో తెదేపాకు పూర్వ వైభవం తెచ్చేలా అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని యనమల సూచించారు. వచ్చే ఎన్నికల్లో అర్జునుడు గెలుపు కోసం అంతా కలసిగట్టుగా కృషి చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.