ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ముంపు సాకుతో.. రాజధానిని తరలించే కుట్ర' - ysrcp

రాజధానిని మార్చాలని వైకాపా ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. ముంపు ప్రాంతం వంక చూపి అమరావతి పనులు నిలిపివేయాలనుకుంటోందని మండిపడ్డారు.

అవనిగడ్డ పర్యటనలో చంద్రబాబు

By

Published : Aug 20, 2019, 7:46 PM IST

Updated : Aug 21, 2019, 5:40 PM IST

అవనిగడ్డ పర్యటనలో చంద్రబాబు

రాజధానిని మార్చాలనే కుట్రతోనే అమరావతిపై.. ముంపు ప్రాంతం అంటూ వైకాపా నేతలు చర్చ లేపుతున్నారని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం అమరావతిని ముంచాలనుకుని.. రైతులను ముంచేసిందిని మండిపడ్డారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో వరద బాధితులను చంద్రబాబు పరామర్శించారు. రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. మంత్రి తీరు దారుణంగా ఉందన్నారు.

'రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారు. మౌలికవసతులు పోగా 8 వేల ఎకరాల వరకు మిగులుతుంది. ఈ భూమి అమ్మినా ఖర్చు లేకుండా రాజధాని నిర్మించవచ్చు. రాజధాని కోసం ఎంత వరకైనా పోరాడతా'- చంద్రబాబు

రాజధానిపై జరుగుతున్న కుట్ర, కుతంత్రాలను ప్రజలు అర్థం చేసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పోలవరం, అమరావతి సహా అన్ని నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

అమరావతిపై త్వరలోనే నిర్ణయం: మంత్రి బొత్స

Last Updated : Aug 21, 2019, 5:40 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details