రాజధాని అమరావతిలో ప్రభుత్వం లేనిపోని సమస్యలు సృష్టిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. 20 రోజులుగా అన్నదాతలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు తెలుపుతున్నా.. ఈ ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. అమరావతికి జరుగుతున్న అన్యాయంపై పార్టీల నేతలంతా గళమెత్తాలని పిలుపునిచ్చారు. అన్ని సంఘాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు అడ్డుకోవడం సరికాదని అన్నారు. ప్రజాభిప్రాయం చెప్పేవారికి పోలీసులు అడ్డు రాకూడదని హితవు పలికారు. ధర్నాలు చేసే వారందరినీ జైల్లో పెడితే.. మొత్తం జైళ్లన్నీ సరిపోవని పేర్కొన్నారు. నిరసన తెలిపితే ఎంత మందిపై కేసులు పెడతారని చంద్రబాబు ప్రశ్నించారు. ఐదు కోట్ల ఆంధ్రులు బయటకు వచ్చి అమరావతికి మద్దతివ్వాలని కోరారు.
భావితరాల భవిష్యత్తు అమరావతి