ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కమిటీల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు: చంద్రబాబు - babu comments on capital news

రాజధాని అమరావతిలో ఇన్​సైడర్​ ట్రేడింగ్​ జరిగితే దర్యాప్తు చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు ప్రభుత్వానికి సూచించారు. అన్ని ప్రాంతాల ప్రజలు అమరావతినే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు విశాఖ దూరంగా ఉందన్న ఆయన.. కమిటీల పేరుతో ముఖ్యమంత్రి కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు.

'రాజధానిలో ఇన్​సైడర్​ ట్రేడింగ్​ జరిగితే దర్యాప్తు చేయండి'
'రాజధానిలో ఇన్​సైడర్​ ట్రేడింగ్​ జరిగితే దర్యాప్తు చేయండి'

By

Published : Jan 6, 2020, 1:37 PM IST

Updated : Jan 6, 2020, 2:42 PM IST

ప్రభుత్వంపై విమర్శలు చేస్తోన్న చంద్రబాబు

ప్రభుత్వం రాజధాని అమరావతిపై కమిటీల పేరుతో ప్రజలను మభ్యపెడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. విజయవాడలో గద్దె రామ్మోహన్​ దీక్షకు సంఘీభావం తెలిపిన ఆయన.. ఇన్​సైడర్​ ట్రేడింగ్​ జరిగితే దర్యాప్తు చేయాలని డిమాండ్​ చేశారు. అన్ని ప్రాంతాల వారు అమరావతినే రాజధానిగా ఉంచాలని కోరుతున్నారని అన్నారు. విశాఖ రాజధానిగా వద్దని విశాఖ వాసులే అంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు విశాఖ దూరంగా ఉందని పేర్కొన్నారు. అమరావతిలో పునాదులకు ఎక్కువ ఖర్చనేది తప్పుడు ప్రచారమన్న చంద్రబాబు.. తాను ఎప్పుడూ ఉద్యోగులను గౌరవిస్తానని చెప్పారు. రాజధానిపై సీఎం, మంత్రులు రోజుకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మన పిల్లలు వేరే ప్రాంతాలకు వెళ్లకుండా అమరావతికి శ్రీకారం చుట్టినట్లు స్పష్టం చేశారు.

Last Updated : Jan 6, 2020, 2:42 PM IST

ABOUT THE AUTHOR

...view details