అన్న కూతురును మూడో అంతస్తు నుంచి పడేశాడు..! - విజయవాడలో దారుణం వార్తలు
మద్యం మత్తులో అన్నదమ్ములు ఘర్షణ పడ్డారు. కోపోద్రిక్తుడైన తమ్ముడు... అన్న కూతురును మూడో అంతస్తు నుంచి పడేశాడు. తీవ్రంగా గాయపడిన బాలిక గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది.

babai-dropping-his-child-from-the-building-in-vijayawada
విజయవాడ నగర శివారు వాంబే కాలనీలో దారుణం జరిగింది. మద్యం మత్తులో యేసు, కృష్ణ అనే అన్నదమ్ములు ఘర్షణ పడ్డారు. వదినను అసభ్యపదజాలంతో దూషించటంతో తన అన్న ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. కోపోద్రిక్తుడైన తమ్ముడు... అన్న కూతురుని మూడో అంతస్తుకు తీసుకెళ్లి కింద పడేశాడు. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. తలకు బలంగా దెబ్బ తగిలింది. గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అన్న కూతురును మూడో అంతస్తు నుంచి పడేశాడు..!
Last Updated : Nov 18, 2019, 5:25 PM IST