Ayyannapatrudu fires on MLA Roja: మహిళా దినోత్సవం సభలో ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఘాటుగా స్పందించారు. మహిళా దినోత్సవం సభ అనే విషయం మర్చిపోయి.. ‘జబర్దస్త్’ వేదిక అనుకుని ఎమ్మెల్యే రోజా రెచ్చిపోయి మాట్లాడారని విమర్శించారు. రోజా తన ప్రసంగంలో సగం సమయం చంద్రబాబు, లోకేశ్‌ను తిట్టేందుకే కేటాయించారన్నారు.
‘దమ్ముంటే ఒక వేదిక మీదకు రా... మా పార్టీ నుంచి తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనితను పంపిస్తాం. ఎవరేం చేశారో తేల్చుకోవచ్చు. ఆమెతో చర్చకు సిద్ధమా’ అని రోజాకు అయ్యన్న సవాల్ విసిరారు. చంద్రబాబు డ్వాక్రా సంఘాలు ఏర్పాటుచేశారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇచ్చారని.. ఇంజినీరింగ్ కళాశాలలను 280కి పెంచారని తెలిపారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన పెళ్లి కానుకను సీఎం జగన్ ఎందుకు ఆపేశారని ప్రశ్నించారు. దిశ చట్టం లేకుండానే దిశ పోలీస్‌స్టేషన్ పెట్టారని ఎద్దేవా చేశారు.
ఇప్పుడున్న 23 సీట్లూ గెలవలేరు.. తెదేపాపై ఎమ్మెల్యే రోజా విమర్శలు