14 నెలల్లో ఒక్క ఇటుక పెట్టని జగన్ 3 రాజధానులు నిర్మిస్తాడని జనాల చెవిలో విజయసాయిరెడ్డి పువ్వులు పెడుతున్నాడని అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. ఇదంతా చూస్తున్న వైకాపా నాయకులు మింగలేక కక్కలేక మొహాలన్నీ కందగడ్డలా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ఒకపక్క కరోనా విలయతాండవం చేస్తుంటే 3 రాజధానుల ఆనందం బ్లూ మీడియాలో తప్ప ఎక్కడా కనపడటం లేదని ధ్వజమెత్తారు.
'14 నెలల్లో ఒక్క ఇటుక పెట్టని జగన్.. 3 రాజధానులు నిర్మిస్తాడట' - విజయసాయిరెడ్డిపై అయ్యన్న కామెంట్స్
వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి.. జగన్ ప్రభుత్వ వైద్యంపై నమ్మకం లేక.. కరోనా రాగానే హైదరాబాద్ వెళ్లారని.. తెదేపా నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు. మళ్లీ ట్విట్లు మెుదలుపెట్టారని విమర్శించారు.
ayyannapatrudu comments on jagan