తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన సంతకాలకు.. కేంద్రం అవార్డులు పంపిస్తే.. ఇప్పుడు సీఎం జగన్ పెట్టించిన సంతకాలకు సీబీఐ, ఈడీ ఛార్జ్షీట్లు విడుదల చేసిందని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని చూస్తే జాలేస్తోందన్నారు. కోట్లు పోసి పీకేతో అల్లుడు జగన్కు శిక్షణ ఇప్పించినా ఆయన పెట్టిన లైవ్ ప్రెస్ మీట్ తుస్సుమందని ఎద్దేవా చేశారు.
ఇప్పుడు లోకేశ్ లైవ్ చూసి అధికారు పార్టీ నేతలు ఊగిపోతున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వారనే విషయం తెలిసే రాజశేఖర్రెడ్డి ఆయన్ను రాష్ట్రంలోకి అడుగుపెట్టనివ్వకుండా బెంగళూరులో ఉంచారని వ్యాఖ్యానించారు. చరిత్రను.. దాస్తే దాగదని ఉద్ఘాటించారు.