Ayyana: ఏ1 జగన్ రెడ్డి వాలంటీర్ల ఉద్యోగాలు ఇస్తే.. తానేమైనా తక్కువ తిన్నానా అంటూ ఏ2 విజయసాయి రెడ్డి సెక్యూరిటీ గార్డ్స్ ఉద్యోగాలు ఇప్పించారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు దుయ్యబట్టారు. జాబ్ మేళా అంటే ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, టెలికాం లాంటి రంగాల్లో ఉద్యోగాలు ఇస్తారేమో అనుకున్నానని, వారు ఇచ్చేది సెక్యూరిటీ గార్డ్, హెల్పర్, సేల్స్ పోస్ట్లని ఇప్పుడే తెలిసిందని ఎద్దేవా చేశారు.
Ayyana: ఉద్యోగం వస్తుందని ఆశించి రావడం.. ముమ్మాటికీ వాళ్ల తప్పే: అయ్యన్నపాత్రుడు - మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు
Ayyana: జాబ్ మేళా అంటే ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, టెలికాం లాంటి రంగాల్లో ఉద్యోగాలు ఇస్తారేమో అనుకున్నానని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. కానీ జగన్ ప్రభుత్వం ఇచ్చేది..సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలని మాజీ మంత్రి దుయ్యబట్టారు.
విజయసాయి రెడ్డి సెక్యూరిటీ గార్డ్స్ ఉద్యోగాలు ఇప్పించారన్న అయ్యన్నపాత్రుడు
జగన్ రెడ్డి హామీ ఇచ్చిన 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎలాగూ చెయ్యడం లేదని.., కనీసం వీసా రెడ్డి సీమ తమ ప్రాంత బిడ్డలకు నాలుగు ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తాడని ఆశ పడ్డామన్నారు. చివరికి బయోడేటాలు ఇచ్చి వెళ్లామన్నారని తెలిసిందని దుయ్యబట్టారు. వైకాపా ప్రచార యావ వల్ల రాను పోను ఛార్జీలు వృధా తప్ప.. ఉద్యోగం వస్తుందని ఆశించి రావడం ముమ్మాటికీ తప్పే అని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: Porus Incident: ఏలూరు జిల్లా పోరస్‌లో ప్రమాదానికి అదే కారణం!