పశ్నిస్తే.. గుండు కొట్టిస్తారా? అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వైకాపా ప్రభుత్వాన్ని నిలదీశారు. బాధితుడు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదన్నారు. న్యాయం కోసం బాధితుడు రాష్ట్రపతికి లేఖ రాశాడంటే వైకాపా పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇళ్ల పట్టాల పేరుతో దళితుల భూములు లాక్కుంటున్నారని అయ్యన్న ఆక్షేపించారు. విశాఖ ఏజెన్సీలో విష జ్వరాలు విజృంభించినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. త్వరలో అయ్యన్నపాత్రుడిని జైళ్లో పెడతామని మంత్రి నాని మాట్లాడారని ఒక మంత్రి మాట్లాడాల్సిన మాటలేనా.. అవి అని ప్రశ్నించారు. ప్రతిపక్ష ప్రశ్నలకు వివరణ ఇవ్వకుండా దాడి చేస్తారా? అంటూ అయ్యన్న మండిపడ్డారు. మంత్రి అవంతి నిజాయితీగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారని.. ఏది అడిగినా విజయసాయి రెడ్డికి చెప్తానంటారేంటని నిలదీశారు. ముఖ్యమంత్రితో మాట్లాడే స్వేచ్ఛ లేదా అని అయ్యన్నపాత్రుడు విమర్శించారు.
'బాధితుడు రాష్ట్రపతికి లేఖ రాశాడంటే.. మీ పాలన అర్థమవుతోంది' - శిరోముండనం బాధితుడి వార్తలు
వైకాపా పాలనలో దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. దళితుల కోసం వైకాపా ప్రభుత్వం ఒక్క మంచి పని చేసిందా? అని ప్రశ్నించారు.

ayyanna patrudu about east godavari tonsure victim