ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పట్టాలివ్వడమే కాదు.. భూమి విక్రయ హక్కును సైతం గిరిజనులకు కల్పిస్తారా?' - గిరిజనులకు రెండెకరాల భూమి

గిరిజనులకు రెండెకరాలు ఇస్తామన్న ముఖ్యమంత్రి జగన్ మాటల్లో నిజమెంతో స్పష్టం చేయాలని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. అటవీ భూమి సాగు చేసుకునే గిరిజనులకు పట్టాలిస్తామని సీఎం జగన్ ప్రకటించటం మోసపూరితమని ఆరోపించారు.

పట్టాలిచ్చిన భూమి విక్రయ హక్కు గిరిజనులకు కల్పిస్తారా?
పట్టాలిచ్చిన భూమి విక్రయ హక్కు గిరిజనులకు కల్పిస్తారా?

By

Published : Oct 4, 2020, 9:56 PM IST

పట్టాలిచ్చిన భూమి విక్రయ హక్కు గిరిజనులకు కల్పిస్తారా?

అటవీ భూమి సాగు చేసుకునే గిరిజనులకు పట్టాలిస్తామని సీఎం జగన్ ప్రకటించటం మోసపూరితమని తెదేపా నేత అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. ఈ విషయంపై కేంద్రం 2006 లోనే చట్టం చేసిందని... ఈ చట్టాన్ని తానే తెచ్చినట్లు జగన్‌ మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. 2005కు ముందు సాగుచేస్తేనే పట్టాలివ్వాలని కేంద్ర చట్టం పేర్కొందని తెలిపారు.

పట్టాలిచ్చిన భూమికి.. విక్రయ హక్కును సైతం గిరిజనులకు కల్పిస్తారా? అని ప్రశ్నించారు. రెండెకరాలు ఇస్తామన్న జగన్ మాటల్లో నిజమెంతో స్పష్టం చేయాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో క్వారీల లీజును వెంటనే రద్దు చేయాలని అయ్యన్న డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details