ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాష్ట్రంలో రాజ్యాంగం ఖూనీ..రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి' - అయ్యన్న తాజా వార్తలు

మంచి వ్యవస్థలుగా పేరొందిన సీఐడీ, ఏసీబీలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలతో దిగజరిపోతున్నాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు విమర్శించారు. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్న పరిస్థితులు నెలకొన్నందున రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కోరారు.

ayyanna on raghurama arrest
రాష్ట్రంలో రాజ్యాంగం ఖూనీ..రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి

By

Published : May 15, 2021, 5:43 PM IST

రాష్ట్రంలో రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్న పరిస్థితులు నెలకొన్నందున రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు కోరారు. మంచి వ్యవస్థలుగా పేరొందిన సీఐడీ, ఏసీబీలు జగన్మోహన్ రెడ్డి చర్యలతో దిగజరిపోతున్నాయని విమర్శించారు. కక్ష సాధింపు చర్యలు, సైకో ప్రవర్తనలతో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుంటే.. ప్రధాని, కేంద్ర హోంశాఖ స్పందించకపోతే ఎలా ? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబుని ఉద్దేశించి జగన్ మాట్లాడిన పలు వీడియోలను అయ్యన్న మీడియాకు విడుదల చేశారు.

క్షత్రియులపై కక్ష సాధింపు చర్యలు ఆపకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు హెచ్చరించారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని వేసిన పిటిషన్ ఈ నెల 17న విచారణకు వస్తున్నందున..,కేసు వాదించకుండా న్యాయవాదుల్ని భయపెట్టేందుకే రఘురామకృష్ణరాజుని అరెస్టు చేశారన్నారు.

ఇదీచదవండి: కింద కోర్టుకు వెళ్లాలని రఘురామకు.. హైకోర్టు సూచన

ABOUT THE AUTHOR

...view details