ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రజల ప్రాణాల కంటే దోచుకోవడంపైనే పాలకుల దృష్టి' - 'ప్రజల ప్రాణాలకంటే దోచుకోవడంపైనే పాలకుల దృష్టి'

రాష్ట్రంలో మలేరియా విజృంభణకు వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని తెదేపా సీనియర్ నేత చింతకాయల ​అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ప్రజల ప్రాణాలకంటే దోచుకోవటంపైనే పాలకులు దృష్టి పెట్టారని ధ్వజమెత్తారు.

'ప్రజల ప్రాణాలకంటే దోచుకోవడంపైనే పాలకుల దృష్టి'
'ప్రజల ప్రాణాలకంటే దోచుకోవడంపైనే పాలకుల దృష్టి'

By

Published : Jun 5, 2020, 1:29 PM IST

ప్రజల ప్రాణాలకంటే దోచుకోవడంపైనే పాలకులు దృష్టి పెట్టారని తెదేపా సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. ఏపీలో మలేరియా విజృంభణకు వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. చంద్రబాబు దోమలపై దండయాత్ర అంటే మంత్రి బుగ్గన హేళన చేశారన్న అయ్యన్న... విశాఖ ఏజెన్సీలో మలేరియా, డెంగ్యూ విస్తరిస్తున్నాయని మండిపడ్డారు. వ్యాధుల తీవ్రతను ముఖ్యమంత్రి గుర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. నేతలకు తొత్తులుగా అధికారులు మారారని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details