ఒక దొంగ... పోలీస్ పై నిఘా పెట్టినట్టు జగన్, విజయసాయి రెడ్డిల ఫోన్ ట్యాపింగ్ తంతు తీరు ఉందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు ట్విట్టర్లో ఎద్దేవా చేశారు.
'పోలీస్‌పై దొంగ నిఘా పెట్టినట్టుంది...జగన్ గారి ట్యాపింగ్ తంతు' - వైకాపా నేతల పై అయ్యన్న విమర్శలు
ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెదేపా నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. 'సాయిరెడ్డి గారు, ఒక దొంగ పోలీస్‌పై నిఘా పెట్టినట్టు ఉంది మీ జగన్ రెడ్డి గారి ట్యాపింగ్ తంతు' అని అయ్యన్న ట్విట్ చేశారు.
మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు
''వంద కోట్లు లంచం ఇచ్చి బెయిల్ తెచ్చుకొని న్యాయవ్యవస్థని భ్రష్టు పట్టించాలని ప్రయత్నించి... సీబీఐకి అడ్డంగా దొరికిపోయిన గాలి దొంగలు, 16 నెలలు చంచల్ గూడా ఊచలు లెక్కపెట్టిన గజ దొంగలు.... ఇప్పుడు న్యాయవాదుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని'' అయ్యన్న మండిపడ్డారు.
ఇవీ చదవండి:ఫోన్ ట్యాపింగ్‌పై నిగ్గు తేల్చండి.. హైకోర్టులో పిల్.. నేడు విచారణ