కరోనా మందులు తయారుచేసిన ఆనందయ్యకు.. ఆయుష్‌శాఖ నోటీసులు జారీ చేసింది. ఒమిక్రాన్‌కు ఆనందయ్య మందు ఇస్తున్నట్లు తెలిసిందని ఆయుష్ కమిషనర్ పి. రాములు అన్నారు. మందుల తయారీకి అనుమతి తీసుకోకుండానే.. 48 గంటల్లో కరోనా తగ్గిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఒమిక్రాన్ పేరిట మందు ఇవ్వకూడదని చెప్పామన్న ఆయన.. ఆనందయ్య వద్ద శాస్త్రీయ ఆధారాలుంటే ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. రోగనిరోధక శక్తి కోసం ఆయుష్ శాఖ వద్ద ఔషధాలు ఉన్నాయని రాములు తెలిపారు.
'ఆనందయ్యకు ఆయుష్ శాఖ నోటీసులు' - ap latest news
కరోనా మందులు తయారుచేసిన ఆనందయ్యకు.. ఆయుష్‌శాఖ నోటీసులు జారీ చేసింది. మందుల తయారీకి అనుమతి తీసుకోకుండానే.. 48 గంటల్లో కరోనా తగ్గిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆయుష్ శాఖ కమిషనర్ రాములు తెలిపారు.
ఒమిక్రాన్ తగ్గిస్తామన్న ఆనందయ్య ప్రకటనల్ని ఖండిస్తున్నాం: ఆయుష్ శాఖ కమిషనర్ పి.రాములు
Last Updated : Jan 12, 2022, 5:24 PM IST