ఆయేషా మీరా హత్య కేసులోని నిందితులను పట్టుకుని శిక్షించడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయని ఆయేషా మీరా తల్లిదండ్రులు ఆరోపించారు. విజయవాడలో ఆయేషా మీరా హత్య జరిగి నేటికి 12 ఏళ్లు గడిచాయి. ఈ నేపథ్యంలో ధర్నాచౌక్ వద్ద ఆయేషా మీరా తల్లిదండ్రులు న్యాయ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సత్యాగ్రహం చేశారు. ప్రజాకోర్టులో హంతకులను శిక్షించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమ బిడ్డను కోల్పోయి... 12 సంవత్సరాలుగా మానసిక క్షోభ అనుభవిస్తున్నామని తల్లి షంషాద్ బేగం అన్నారు. దిశ చట్టాన్ని తమ పాప కేసుకు వర్తింపజేసి నిందితులను శిక్షించాలంటూ ఆమె కోరారు.
'నిందితులను శిక్షించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి'
తమ బిడ్డను హత్య చేసి 12 ఏళ్లు కావస్తున్నా నిందితులను శిక్షించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ ఆయేషా మీరా తల్లి ఆరోపించారు.
'నిందితులను శిక్షించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి'