తనతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ ఇస్తానని పలువురిని మోసం చేసిన రావిప్రోలు శ్రీ హర్షను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకూ పలువురి నుంచి రూ.17కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. గతంలో యూఏఈలోని అబుదాబిలో యాక్సిస్ బ్యాంకులో శ్రీహర్ష పని చేసినట్లు పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్‌కి చెందిన బాధితుడు రవిశంకర్ ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.
stock cheat:స్టాక్మార్కెట్లో అధిక వడ్డీ పేరుతో మోసం - తెలంగాణ తాజా వార్తలు
అధికవడ్డీ ఆశతో చాలామంది ఉన్నది పోగొట్టుకుంటున్నారు. ప్రజల్లోని ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని మోసగాళ్లు గాలం వేస్తున్నారు. చిక్కుకున్నవారి నుంచి లక్షల్లో కాజేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది.
స్టాక్మార్కెట్లో అధిక వడ్డీ పేరుతో మోసం
పలువురి నుంచి డబ్బులు వసూలు చేసిన శ్రీహర్ష 2019 సెప్టెంబర్ నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. పంజాబ్ మొహాలిలోని ఖరార్‌లో శ్రీహర్ష తలదాచుకున్నాడని సమాచారం అందుకున్న పోలీసులు... నిందితుడు శ్రీహర్షని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.