కొవిడ్ ఆసుపత్రులు, కేర్ సెంటర్లలో అగ్నిప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విజయవాడలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కరోనా చికిత్స అందిస్తున్న ఆసుపత్రి ఎలక్ట్రీషియన్స్కు శిక్షణ ఇచ్చారు. ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనుకోని విపత్తు ఎదురైతే క్షతగాత్రులను ఏ విధంగా కాపాడాలో డెమో ద్వారా చూపారు.
ప్రమాదాల నివారణపై అగ్నిమాపక, విద్యుత్ శాఖ అవగాహన కార్యక్రమం - కొవిడ్ ఆస్పత్రుల సిబ్బందికి అవగాహనా కార్యక్రమం
కరోనా కేసులు పెరగుతుండటంతో కొవిడ్ కేర్ సెంటర్లకు అధికారులు అనుమతులిస్తున్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన చర్యలపై.. అగ్నిమాపక, విద్యుత్ శాఖ అధికారులు విజయవాడలోని పలు ఆస్పత్రుల సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.

విజయవాడలో అవగాహన కార్యక్రమం
విజయవాడలో అవగాహన కార్యక్రమం
మంటలను ఏవిధంగా అదుపులోకి తీసుకురావాలి.. ఎటువంటి ఫైర్ ఫైటింగ్ పరికరాలు వినియోగించాలో అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. ఆసుపత్రుల్లో విద్యుత్ పరికరాలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో విద్యుత్ శాఖ అధికారులు వివరించారు.