బీసీ అంటే బ్రాహ్మణ కార్పొరేషన్(Brahmin Corporation) అనే కొత్త నిర్వచనం జగన్ రెడ్డి(cm jagan) ఇస్తున్నారా? అని తితిదే పాలకమండలి మాజీ సభ్యులు ఏవీ రమణ పశ్నించారు. పేద బ్రాహ్మణలను ఆదుకునేందుకు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన చంద్రబాబుకు గుర్తింపు రాకూడదనే జగన్ రెడ్డి రెండేళ్లుగా బ్రాహ్మణ కార్పొరేషన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. దేవాదాయ శాఖ పరిధిలోని బ్రాహ్మణ కార్పొరేషన్‌ను, బీసీ కార్పొరేషన్లో విలీనం చేయటం దుర్మార్గమన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ నిధుల్ని పక్కదారి పట్టించి ఇప్పుడు ఈ విధమైన కుట్రలు దేని కోసమని నిలదీశారు.
'బీసీ అంటే బ్రాహ్మణ కార్పొరేషన్ అనే కొత్త నిర్వచనం జగన్ రెడ్డి ఇస్తున్నారా ?' - av ramana latest news
సీఎం జగన్(cm jagan)పై తితిదే పాలక మండలి మాజీ సభ్యులు ఏవీ రమణ మండిపడ్డారు. బీసీ అంటే బ్రహ్మణ కార్పొరేషన్(Brahmin Corporation) అనే కొత్త నిర్వచనం జగన్ రెడ్డి ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. దేవాదాయ శాఖ పరిధిలోని బ్రాహ్మణ కార్పొరేషన్‌ను, బీసీ కార్పొరేషన్లో విలీనం చేయటాన్ని దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు..
A.v Ramana