ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Autos Special Drive: ఆటోల కట్టడికి నేటి నుంచి స్పెషల్‌ డ్రైవ్‌ - ఆటోల కట్టడికి నేటి నుంచి స్పెషల్‌ డ్రైవ్‌

Autos Special Drive: హైదరాబాద్‌లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఆటోలను కట్టడి చేసేందుకు ఇవాళ్టి నుంచి పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టనున్నారు. నిబంధనల ప్రకారం.. హైదరాబాద్‌ పరిధిలో రిజిస్ట్రేషన్‌ జరిగిన ఆటోలకు మాత్రమే నగరంలోకి తిరిగేందుకు అనుమతి ఉంది. ఇవాళ్టి నుంచి చేపట్టే ప్రత్యేక తనిఖీల్లో ఆటోలకు సంబంధించిన ధ్రువపత్రాలను... క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అనుమతిలేని ఆటోలను సీజ్‌ చేయనున్నారు.

Autos Special Drive
ఆటోల కట్టడికి నేటి నుంచి స్పెషల్‌ డ్రైవ్‌

By

Published : Feb 28, 2022, 10:30 AM IST


Autos Special Drive: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఆటోలను కట్టడి చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. నేటి నుంచి నగరంలో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టనున్నారు. హైదరాబాద్​ పరిధిలో రిజిస్ట్రేషన్‌ జరిగిన ఆటోలకు మాత్రమే నగరంలో తిరిగేందుకు అనుమతి ఉంది. కాగా.. రవాణా, పోలీసుశాఖలు చూసీచూడనట్టు వదిలేయటంతో తెలంగాణ, ఏపీల నుంచి కొనుగోలు చేసిన ఆటోలను యథేచ్ఛగా తిప్పుతున్నారు. ట్రాఫిక్‌ రద్దీ, కాలుష్యతీవ్రత పెరిగేందుకు కారకులవుతున్నారు. హైదరాబాద్‌ జిల్లా రవాణాశాఖ గణాంకాల ప్రకారం.. 1.50 లక్షల ఆటోలు రిజిస్ట్రేషన్‌ జరిగాయి. రహదారులపై వాటి సంఖ్య 3లక్షలు దాటింది.

వీటిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఇటీవల ట్రాఫిక్‌ పోలీసులు ఆటో డ్రైవర్లు, సంఘాలకు అవగాహన కల్పించారు. ఉబర్, ఓలా వంటి సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. నగరంలోకి అనుమతులున్న ఆటోలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. టీఎస్‌/ఏపీ 09-13లతో రిజిస్ట్రేషన్‌ జరిగిన ఆటోలను మాత్రమే అనుమతించనున్నారు. ప్రత్యేక తనిఖీల్లో ఆటోలకు సంబంధించిన ధ్రువీకరణపత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆర్‌సీ, డ్రైవింగ్‌ లైసెన్స్, ఇన్సూరెన్స్, యూనిఫాం తప్పనిసరిగా ఉండాలని పోలీసులు ఆటోడ్రైవర్లకు సూచిస్తున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆటోలకు జరిమానాలు.. అనుమతిలేకుండా నగరంలోకి ప్రవేశించిన ఆటోలను సీజ్‌ చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details