ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడలో ఈనాడు ఆధ్వర్యంలో ఆటో ఎక్స్​పో - auto expo has started in vijayawada latest updates

'కలల బండిని ఎంచుకోండి' అనే నినాదంతో.. విజయవాడలో ఈనాడు ఆధ్వర్యంలో ఆటోఎక్స్‌పో ప్రారంభమైంది. సిద్దార్ధ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ మైదానంలో రెండు రోజుల పాటు జరగనున్నఈ ఎక్స్​పోను.. డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ ఎం. పురేంద్ర ప్రారంభించారు.

auto expo has started in vijayawada in association with eenadu
విజయవాడలో ఈనాడు ఆధ్వర్యంలో ఆటోఎక్స్​పో

By

Published : Mar 6, 2021, 4:54 PM IST

'కలల బండిని ఎంచుకోండి' అనే నినాదంతో.. విజయవాడలో ఈనాడు ఆధ్వర్యంలో ఆటోఎక్స్‌పో ప్రారంభమైంది. సిద్దార్ధ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ మైదానంలో రెండు రోజుల పాటు ఈ ఆటో ఎక్స్‌పో జరగనుంది. ఎక్స్​పోను డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ ఎం.పురేంద్ర, విజయవాడ ఈనాడు యూనిట్‌ ఇన్‌ఛార్జి చంద్రశేఖర్‌ ప్రారంభించారు. ప్రముఖ కంపెనీలకు చెందిన ద్విచక్ర వాహనాలు, కార్లు 20 స్టాళ్లలో ప్రదర్శించారు.

ప్రముఖ కంపెనీల కార్లు, ద్విచక్ర వాహనాలతోపాటు.. బ్యాంకుల నుంచి రుణం పొందేందుకు వీలుగా స్టాళ్లను ఒకేచోట ఉంచడం అభినందనీయమని పురేంద్ర అన్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఎక్స్‌పో ఉంటుందని.. విజయవాడ ఈనాడు యూనిట్‌ ఇన్‌ఛార్జి చంద్రశేఖర్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details