ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్.. హత్యాయత్నం - Engineering student raped by auto driver

హైదరాబాద్‌ నగర శివారులో ఫార్మసీ విద్యార్థినిపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. కళాశాల నుంచి ఆటోలో ఇంటికి వస్తున్న యువతిని కిడ్నాప్‌ చేయగా.. సకాలంలో పోలీసులు రక్షించారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

Auto Driver rape on engineering student
ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్..హత్యాయత్నం

By

Published : Feb 11, 2021, 9:27 AM IST

తెలంగాణలోని హైదరాబాద్‌ కీసరలో యువతిని కిడ్నాప్‌ చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఓ ఫార్మసీ కళాశాలలో చదువుతున్న యువతి కాలేజీ నుంచి ఇంటికి బయలు దేరింది. కళాశాల వద్ద ప్రధాన రహదారిపై ఆటో కోసం నిల్చుంది. ఓ ఆటోలో వృద్ధురాలితోపాటు చిన్నారి ఉండటంతో తానూ ఎక్కింది. కొంతదూరం వెళ్లాక వారు దిగిపోగా.. అనంతరం మరో ఇద్దరు యువకులు వాహనం ఎక్కారు. కాసేపటికి యువతి దిగాల్సిన ఆర్​ఎల్​ఆర్​ నగర్‌ స్టాప్‌ వచ్చినా డ్రైవర్‌ వాహనం ఆపకుండా వేగంగా ముందుకు తీసుకువెళ్లాడు. అందులో ఉన్న యువకులు ఆమె అరవకుండా నోరు మూసి గట్టిగా పట్టుకున్నారు. ఆటో ఘట్‌కేసర్‌ మండలం, యంనంపేట వద్దకు రాగానే అక్కడే సిద్ధంగా ఉన్న ఓ వ్యాన్‌లోకి యువతిని ఎక్కించి తీసుకువెళ్లారు.

కిడ్నాప్‌కు గురైనట్లు సెల్‌ఫోన్‌ ద్వారా యువతి తన తల్లికి సమాచారం ఇచ్చింది. అప్రమత్తమైన తల్లిదండ్రులు డయల్‌ 100కు ఫోన్‌చేసి చెప్పారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా యంనంపేట వద్దకు పోలీసులు చేరుకున్నారు. ఈ లోగా తల్లిదండ్రులకు ఫోన్‌ చేసిందన్న విషయం తెలిసి దుండగులు ఆ యువతిని సమీప పొదల్లోకి లాక్కెళ్లారు. అక్కడ కర్రలతో తీవ్రంగా కొట్టారు. అదే సమయంలో పోలీసు వాహనాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడంతో యువతిని వదిలిపెట్టి నలుగురు పారిపోయారు. గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సీపీ కెమెరాల ద్వారా ఘటనను విశ్లేషిస్తున్నామని.. కిడ్నాప్‌నకు ప్రయత్నించింది ఎవరో.. ఎందుకు చేశారో విచారణ జరుపుతున్నామని మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి తెలిపారు.

ఈ ఘటనపై స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆరా తీశారు. జిల్లా ఇంఛార్జీ మంత్రి మల్లారెడ్డితో మాట్లాడారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రాచకొండ సీపీకి ఆదేశించారు. బాధితురాలికి మెరుగైన చికిత్స ఇవ్వాలని ఆస్పత్రి వర్గాలను కోరారు.

ఇదీ చదవండి:ఉద్ధృతంగా విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం

ABOUT THE AUTHOR

...view details