ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గవర్నర్​తో ఆస్ట్రేలియా హై కమిషనర్ సమావేశం - గవర్నర్​తో సమావేశమైన ఆస్ట్రేలియా హై కమిషనర్ వార్తలు

గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌ను ఆస్ట్రేలియా హై కమిషనర్ ఓ ఫారెల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాజ్ భవన్‌లో కలిశారు. భారత్‌లో వాణిజ్య సంబంధాలను ప్రోత్సహించడానికి, ఏపీలో పెట్టుబడులకు అవకాశాలను పరిశీలించటానికి తన పర్యటన ఉపకరిస్తుందని ఫారెల్ గవర్నర్​కు వివరించారు.

గవర్నర్​తో సమావేశమైన ఆస్ట్రేలియా హై కమిషనర్
గవర్నర్​తో సమావేశమైన ఆస్ట్రేలియా హై కమిషనర్

By

Published : Mar 8, 2021, 9:33 PM IST

ఆస్ట్రేలియా హై కమిషనర్ ఓ ఫారెల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను రాజ్ భవన్‌లో కలిశారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న అనేక కార్యక్రమాల వల్ల ఆస్ట్రేలియా, భారత్​ల మధ్య సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని ఫారెల్ గవర్నర్‌కు తెలియజేశారు. కరోనా మహమ్మారి తీవ్రతరం అవుతున్న వేళ 2020 మే నెలలో తాను బాధ్యతలు స్వీకరించానని..,పరిస్థితులను అధిగమించడానికి భారత్​ చేపడుతున్న చర్యలను నిశితంగా గమనించానని ఆయన తెలిపారు. గవర్నర్ బిశ్వభూషణ్ మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొవిడ్ -19 టీకా కార్యక్రమం వల్ల ప్రజలు తమ సాధారణ కార్యకలాపాలను కొనసాగించడానికి అవసరమైన ఉపశమనాన్ని పొందగలిగారన్నారు. ఆర్థిక వ్యవస్థ కూడా పునరుత్తేజ దశలో ఉందన్నారు.

భారత్‌లో వాణిజ్య సంబంధాలను ప్రోత్సహించడానికి, ఏపీలో పెట్టుబడులకు అవకాశాలను పరిశీలించటానికి తన పర్యటన ఉపకరిస్తుందని ఫారెల్ గవర్నర్​కు వివరించారు. విశాఖపట్నంలో ఏపీ మెడ్‌టెక్ జోన్, బొగ్గు గనులు, సౌర ఫలకాలు, వాహనాలు, బ్యాటరీల తయారీ, ఖనిజాల అన్వేషణ, ఎలక్ట్రిక్ రంగాలలో పెట్టుబడులను విస్తరించడానికి ఆస్ట్రేలియా ఇప్పటికే రాష్ట్రంతో ఒప్పందాలు కుదుర్చుకుందని హై కమిషనర్ తెలిపారు. ఆస్ట్రేలియా సందర్శించాలని గవర్నర్​ను ఓ ఫారెల్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా మెమెంటో, శాలువాతో ఫారెల్​ను గవర్నర్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో చెన్నై కాన్సుల్ జనరల్ సారా కిర్లేవ్‌, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికల్ వలవన్, ఏపీ ఎకనామిక్ డెవలప్​మెంట్ బోర్డ్ సీఈవో సుబ్రమణ్యం, గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details