ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Attempted burglary at former CP home : మాజీ సీపీ ఇంట్లో చోరీకి యత్నం...కత్తులతో బెదిరింపు...ఆపై.. - విశాఖ మాజీ పోలీస్ కమిషనర్ తాతినేని యోగానంద్ తల్లిదండ్రులు

Attempted burglary at former CP home : విశాఖపట్నం మాజీ పోలీస్ కమిషనర్ తాతినేని యోగానంద్ తల్లిదండ్రులు నివసించే ఇంట్లో శనివారం మధ్యాహ్నం గుర్తు తెలియని ఆగంతకులు దొంగతనం చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అనంతరం పని మనిషి రాగానే చల్లగా జారుకున్నారు. ఆ వివరాలు...

Attempted burglary at former CP home
మాజీ సీపీ ఇంట్లో చోరీకి యత్నం

By

Published : Dec 26, 2021, 2:00 PM IST

Attempted burglary at former CP home : విశాఖపట్నం మాజీ పోలీస్ కమిషనర్ తాతినేని యోగానంద్ తల్లిదండ్రులు నివసించే ఇంట్లో శనివారం మధ్యాహ్నం గుర్తు తెలియని ఆగంతకులు దొంగతనం చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అనంతరం పని మనిషి రాగానే చల్లగా జారుకున్నారు.

జరిగింది ఇదీ ...

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...విశాఖ మాజీ పోలీస్ కమిషనర్ తాతినేని యోగానంద్ తల్లిదండ్రులు వెంకట తాతారావు, స్వర్ణకుమారి దంపతులు విజయవాడలోని కానూరు పిన్నమనేని టీచర్స్‌కాలనీలో నివాసముంటున్నారు. మధ్యాహ్నం 2గంటల 15నిమిషాల సమయంలో ఇద్దరు ఆగంతకులు కరోనా వాక్సినేషన్ వెరిఫికేషన్‌కు వచ్చినట్లు మాట్లాడారు. హాలులో ఉన్న భార్యా భర్తలపై దాడి చేసి నగదు, బంగారం ఇవ్వకపోతే చంపేస్తామంటూ కత్తులతో బెదిరించారు. వెంకట తాతారావు ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేయగా.. ఆయన కుర్చీలోంచి కింద పడిపోయారు. ఇంతలో వారింట్లో పనిచేసే సత్తిపండు రాగానే, చోరీకి వచ్చిన ఇద్దరూ... కిందపడిపోయిన తాతారావును కుర్చీలో కూర్చోబెడుతున్నట్లు నటిస్తూ నెమ్మదిగా అక్కడ నుంచి జారుకున్నారు.ఈ ఘటనపై వెంకట తాతారావు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ఇంటి సమీపంలోని సీసీ ఫుటేజీలను సేకరిస్తున్నామని చెప్పారు. చోరీయత్నం చేసిన వ్యక్తుల కోసం గాలిస్తున్నామన్నారు.

మాజీ సీపీ ఇంట్లో చోరీకి యత్నం

ఇదీ చదవండి : CYBER CRIME ON VOTER CARDS: ‘ఓటరు కార్డు’...సైబర్‌ నేరగాళ్ల కొత్త ఆయుధం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details