విజయవాడ నగర శివారు శాంతీనగర్ పార్క్ సమీపంలో... ఓ యువకుడు బ్లేడ్ గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉండడం కలకలం రేపింది. తీవ్ర రక్తస్రావంతో ఉన్న యువకుడిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రుడు వాంబే కాలనీకి చెందిన వినయ్‌గా పోలీసులు గుర్తించారు. మద్యానికి బానిసై అతనే బ్లేడ్ తో కోసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇది బ్లేడ్ బ్యాచ్ పనేనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి, దర్యాప్తు చేస్తున్నారు.
విజయవాడ శివారులో అపస్మారక స్థితిలో యువకుడు..ఏం జరిగింది! - AP LATEST NEWS
విజయవాడలో ఓ యువకుడు బ్లేడు గాయాలతో అపస్మారక స్థితిలో పడి కనిపించాడు. మద్యానికి బానిసై యువకుడే గాయపర్చుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇది బ్లేడ్ బ్యాచ్‌పనేని స్థానికులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ATTACK