Attack on VMC Staff: విజయవాడ కేదారేశ్వరపేట మామిడికాయల పాకల వద్ద రోడ్డుకు అడ్డంగా కొందరు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ దుకాణాలతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోందని వీఎంసీ కమిషనర్ కు కొందరు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదును అనుసరించి.. ఆ దుకాణాలను తొలగించాలని కమిషనర్ ఆదేశాలు జారీచేసారు. దీంతో.. రోడ్డుపై ఉన్న దుకాణాలను తొలగించేందుకు మునిసిపల్ సిబ్బంది రంగంలోని దిగారు. అయితే.. తమ దుకాణాలు తొలగిస్తున్నారని ఆగ్రహించిన వ్యాపారస్తులు.. వీఎంసీ సిబ్బందిపై దాడి చేశారు. దీంతో అక్కడఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
రోడ్డుపై దుకాణాలను తొలగించిన సిబ్బంది.. దాడి చేసిన వ్యాపారులు! - Attack on VMC Staff at Vijayawada
Attack on VMC Staff: రోడ్డుకు అడ్డంగా దుకాణాలు పెట్టి ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నారంటూ ఫిర్యాదులు అందాయి. దీంతో.. వాటిని తొలగింపు చేపట్టిన సిబ్బందిపై వ్యాపారస్తులు దాడి చేశారు. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.
Attack on VMC Staff at Vijayawada