తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. మరో రెండు రోజుల్లో మిస్టరీ వీడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలతో పాటు చుట్టుప్రక్కల ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. మొత్తం ప్రాంతాల్లో దర్యాప్తు చేసి.. నిందితులను గుర్తించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే... ఈ కేసులో పట్టాభిపై దాడి చేసిన నిందితుల్లో ఐదుగురుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అయితే దాడికి రాజకీయ కారణాలున్నాయా? వ్యక్తిగత కక్షలా? అనే అంశంపై పోలీసులకు ఇంకా స్పష్టత రాలేదు. రెండురోజుల్లో దాడికి కారణాలు.. నిందితుల పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.