కృష్ణలంక పీఎస్‌లో అర్ధరాత్రి ఎంపీ నందిగం సురేష్ హల్‌చల్ - కృష్ణలంక పీఎస్‌లో అర్ధరాత్రి ఎంపీ నందిగం సురేష్ హల్‌చల్
07:47 February 16
అర్ధరాత్రి కానిస్టేబుల్‌పై దాడి
విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో అర్ధరాత్రి ఎంపీ నందిగం సురేష్ హల్‌చల్ చేశారు. ర్యాష్ డ్రైవింగ్ కేసులో కొందరు యువకులను పోలీసులు పీఎస్‌కు తీసుకెళ్లారు. తాము ఎంపీ నందిగం సురేష్ అనుచరులమంటూ ఆ యువకులు హంగామా చేశారు. విషయం తెలుసుకుని ఎంపీ.. పీఎస్‌కు వెళ్లారు. కృష్ణలంక ఎస్‌ఐతో సురేష్ అనుచరుల వాగ్వాదానికి దిగారు. వీడియో తీస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్‌పై ఎంపీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. కానిస్టేబుల్ ఫోన్ తీసుకొని బయటకెళ్లారు. తన ఫోన్ అడిగిన కానిస్టేబుల్‌పై ఎంపీ అనుచరులు మళ్లీ చేయిచేసుకున్నారు. యువకుల్లో ఎంపీ సురేష్ సమీప బంధువు ఉన్నట్లు సమాచారం.
TAGGED:
mp nandigam suresh taza