ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 30, 2022, 6:49 PM IST

ETV Bharat / city

అందుకు నైతిక బాధ్యత వహించి మంత్రి బొత్స రాజీనామా చేయాలి: అచ్చెన్నాయుడు

పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీపై తెదేపా నేత అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిందితులపై చర్యలు తీసుకోకుండా సీఎం చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ.. విద్యాశాఖ మంత్రి బొత్స రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

అందుకు నైతిక బాధ్యత వహించి మంత్రి బొత్స రాజీనామా చేయాలి
అందుకు నైతిక బాధ్యత వహించి మంత్రి బొత్స రాజీనామా చేయాలి

పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా చేయాలని.. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు. వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ ప్రభుత్వ వైఫల్యమేని అన్నారు. అన్ని వ్యవస్థలతోపాటు విద్యా వ్యవస్థను కూడా భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షల ప్రశ్నాప్రత్రాలు వరుసగా లీకవుతుంటే సీఎం జగన్ చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ప్రశ్నా పత్రాలు లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా... అసలు లీకే కాలేదని విద్యాశాఖ మంత్రి బొత్స సమర్ధించుకోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. రోజూ పదవ తరగతి ప్రశ్నాపత్రాలు మార్కెట్లో న్యూస్ పేపర్ల మాదిరిగా అమ్ముకుంటున్నా.., అందుకు సాక్ష్యాలు కనిపిస్తున్నా.., విద్యాశాఖ మంత్రి స్పందించటం లేదన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీపై సమగ్ర విచారణ జరిపించాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details