ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కార్పొరేట్​లో చికిత్సకు అనుమతించండి' హైకోర్టులో అచ్చెన్న పిటిషన్

గుంటూరు లేదా విజయవాడలోని ఏదైనా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి సొంత ఖర్చులతో చికిత్స చేయించుకునేందుకు వీలుగా ఆదేశాలు జారీచేయాలని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశముంది.

atchannaidu petetion in high court
atchannaidu petetion in high court

By

Published : Jul 3, 2020, 3:44 AM IST

'జూన్ 11న నాకు శస్త్ర చికిత్స జరిగింది. 12వ తేదీన అనిశా అధికారులు అరెస్టు చేసి ఇబ్బందికర పరిస్థితుల్లో కారులో కూర్చొబెట్టి 600 కిలోమీటర్లు ప్రయాణం చేయించారు. అనిశా కేసుల ప్రత్యేక న్యాయాధికారి ముందు హాజరుపరచగా.. జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. జూన్ 13న గుంటూరు జీజీహెచ్​కు తరలించారు. 17వ తేదీన రెండోసారి శస్త్రచికిత్స చేశారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో మంచం నుంచి కదిలే పరిస్థితి లేదు. ఈ నెల 1న బెయిల్ దరఖాస్తుపై అనిశా కోర్టు విచారణ జరిపింది. నిర్ణయాన్ని వాయిదా వేసింది. అదే రోజు సాయంత్రం నన్ను ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు. అనిశా కోర్టు అనుమతి తీసుకోకుండానే విజయవాడ సబ్​ జైలుకు తరలించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జైలుకు తరలించడం సరికాదు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకునే నిమిత్తం అనుమతివ్వండి ' అని అచ్చెన్నాయుడు పిటిషన్​లో కోరారు.

ABOUT THE AUTHOR

...view details