తెదేపా హయాంలో హ్యాపీ సండేస్ నిర్వహిస్తే వైకాపా హయాంలో వారాంతాల్లో విధ్వంసాలకు పాల్పడుతున్నారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. వెలగపూడి రామకృష్ణబాబు భూమి విషయం.. కోర్టు పరిధిలో ఉండగా.. ప్రభుత్వం ఏ విధంగా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు. నిరాధార ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే పీలా గోవింద్ కు సంబంధం లేకపోయినా వైకాపా పేటిఎం బ్యాచ్ దుష్ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు.
వైకాపా హయాంలో వారాంతాల్లో విధ్వంసాలు: అచ్చెన్నాయుడు - విశాఖ భూ కబ్జాలపై జగన్పై అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు
విశాఖలో రాజధాని పేరుతో వేల ఎకరాల భూ కబ్జాలకు జగన్ అండ్ కో పాల్పడిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. వారి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తెదేపా నేతలు పీలా గోవింద్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై బురద జల్లడం దివాలకోరుతనమని మండిపడ్డారు.
atchannaidu comments on cm jagan