అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జులై 1 నుంచి 3 వరకు జరగనున్న 17వ ఆటా తెలుగు మహాసభలకు హాజరుకావాలని ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్ను ఆహ్వానించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు జగన్ను కలిశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బూజల, ఆటా సెక్రటరీ, నార్త్ అమెరికాలో ఏపీ ప్రభుత్వ సలహాదారు హరిప్రసాద రెడ్డి లింగాల, ఆటా ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్ సన్నీ రెడ్డి, ఆటా అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ జయంత్ చల్లా ఉన్నారు.
సీఎం జగన్ను తెలుగు మహాసభలకు ఆహ్వానించిన ఆటా ప్రతినిధులు - అమెరికా తెలుగు మహాసభ వార్తలు
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్ను కలిశారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జులై 1 నుంచి 3 వరకు జరగనున్న 17వ ఆటా తెలుగు మహాసభలకు హాజరుకావాలని జగన్ను ఆహ్వానించారు.

ఆటా ప్రతినిధులు