విజయవాడలోని మొగల్రాజ్పురం కస్తూరి భాయ్ పేటలో కొండ చరియలు విరిగి పడి రెండిళ్లు ధ్వంసం అయ్యాయి. మరో రెండు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇటీవల కాలంలో చిన్న చిన్న రాళ్లు పడుతున్నప్పటికీ.. ఈరోజు భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు పేర్కొన్నారు.
లైవ్ వీడియో.. కొండ చరియలు విరిగి పడి రెండిళ్లు ధ్వంసం - కృష్ణా న్యూస్
విజయవాడలోని మొగల్రాజ్పురం కస్తూరి భాయ్పేటలో కొండ చరియలు విరిగి పడి రెండు ఇళ్లు ధ్వంసం అవ్వగా.. మరో రెండిళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్, పోలీస్ సిబ్బంది అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు పేర్కొన్నారు.
కొండ చరియలు విరిగి పడి రెండిళ్లు ధ్వంసం