ఎన్నికల సమయంలో సీఎం జగన్ మైనారిటీలకు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని.. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ.. రాష్ట్ర మైనార్టీ ముఖ్యకార్యదర్శి ఎం.డీ.ఇంతియాజ్‌ను కోరారు. దుల్హన్ పథకం, విదేశీ విద్య పథకం, మైనారిటీల సబ్ ప్లాన్, ఇస్లామిక్ బ్యాంక్, ఏపీఎస్ఎమ్ఎఫ్సీ (APSMFC), వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, ఇమామ్ మౌజన్లకు గౌరవ వేతనాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటివరకు ఏ ఒక్క పథకం అమలుకు నోచుకోలేదన్నారు. కరోనాతో మృతిచెందిన ఎస్సీలకు ఇస్తున్న రూ.5లక్షల సబ్సిడీ రుణం.. ముస్లిం మైనారిటీలకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి: ఫారూఖ్ షిబ్లీ
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమయంలో ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీలను.. తక్షణం అమలు చేయాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర మైనార్టీ ముఖ్యకార్యదర్శి ఎం.డీ.ఇంతియాజ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. దుల్హన్ పథకం, విదేశీ విద్య పథకం, మైనారిటీల సబ్ ప్లాన్ వంటివి ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదన్నారు.
ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
TAGGED:
farooq shibli latest news