ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Polavaram: డయాఫ్రం వాల్‌ సామర్థ్య పరీక్షలపై భరోసా.. ఎన్‌హెచ్‌పీసీ నిపుణుల హామీ - పోలవరం వార్తలు

Polavaram: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన డయాఫ్రం వాల్‌ సామర్థ్యం పరీక్షించడం సాధ్యమేనని.. జాతీయ హైడ్రో పవర్‌ కంపెనీ (ఎన్‌హెచ్‌పీసీ) నిపుణులు తేల్చారు. ఈ వాల్‌ సామర్థ్యాన్ని మూడు, నాలుగు రకాల పరీక్షలతో నిర్ధారిస్తామని వారు పేర్కొన్నట్లు తెలిసింది.

Assurance on polavaram diaphragm wall capacity testing
డయాఫ్రం వాల్‌ సామర్థ్య పరీక్షలపై భరోసా

By

Published : Jun 29, 2022, 7:09 AM IST

Polavaram: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన డయాఫ్రం వాల్‌ సామర్థ్యం పరీక్షించడం సాధ్యమేనని జాతీయ హైడ్రో పవర్‌ కంపెనీ (ఎన్‌హెచ్‌పీసీ) నిపుణులు తేల్చారు. ఈ ప్రాజెక్టులో కీలకమైన ఈ వాల్‌ కొంత మేర ధ్వంసం కావడం, మరికొంత భాగం నీళ్లలో ఉండటంతో దీని సామర్థ్యం ఎలా ఉంది? దీని విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది కొంతకాలంగా నిపుణులు తర్జనభర్జన పడుతున్న విషయం తెలిసిందే. అసలు డయాఫ్రం వాల్‌ సామర్థ్యాన్ని పరీక్షించే అవకాశం ఎంతవరకు ఉందన్న చర్చలు కూడా జరిగాయి.

ఈ క్రమంలోనే తీస్తా ప్రాజెక్టులో ఇలాంటి సమస్యను గుర్తించిన ఎన్‌హెచ్‌పీసీ నిపుణులు పోలవరం పరిస్థితిని కూడా పరిశీలించాలని కేంద్ర పెద్దలు, ఏపీ జలవనరులశాఖ అధికారులు కోరారు. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్‌పీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎల్‌.కపిల్‌, మరో ఇద్దరు నిపుణులు విపుల్‌ నాగర్‌, ఎ.కె.భారతి మంగళవారం ఇక్కడకు వచ్చి డయాఫ్రం వాల్‌ మొత్తం పరిశీలించారు.

ఈ వాల్‌ సామర్థ్యాన్ని మూడు, నాలుగు రకాల పరీక్షలతో నిర్ధారిస్తామని వారు పేర్కొన్నట్లు తెలిసింది. ఈ పరీక్షలు చేయాలంటే ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే విషయమై పోలవరం అధికారులకు, మేఘా ఇంజినీరింగ్‌ ప్రతినిధులకు వివరాలు ఇవ్వనున్నారు. అన్నీ సిద్ధంచేసి పిలిస్తే పరీక్షలు చేయగలమని భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఏయే మార్గాల ద్వారా కాంక్రీటు సామర్థ్యాన్ని పరీక్షించవచ్చో తెలియజేశారు. వర్షం అంతరాయం కలిగించినా.. వారు రోజంతా పోలవరంలో పర్యటించారు. బుధవారం కూడా వారు ఇదే పనిలో ఉంటారు.

ABOUT THE AUTHOR

...view details