Case on CM KCR: సర్జికల్స్ స్ట్రయిక్స్పై.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై అసోం భాజపా నేతలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్లో సర్జికల్ స్ట్రయిక్స్కు ఫ్రూప్ కావాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. దీనిపై అసోంలో పలువురు భాజపా నేతలు కేసీఆర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు అందిన ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు కేసు నమోదు చేసే యోచనలో ఉన్నట్లు ప్రముఖ వార్త ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది.
స్పందించిన లెఫ్టినెంట్ గవర్నర్
సర్జికల్ స్ట్రయిక్స్ మీద సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా స్పందించారు. భారత సైన్యం ధైర్యసాహసాలపై ఎవరికీ ఎలాంటి సందేహం లేదని అన్నారు. అలాంటి వారికి దేవుడు మంచి బుద్ధి ప్రసాదిస్తాడని.. దేశం, సైన్యంపై మంచి ఆలోచనా విధానాన్ని కలిగి ఉంటారని చెప్పారు.
సర్జికల్ స్ట్రయిక్స్పై కేసీఆర్ ఏమన్నారంటే?
ఆదివారం మీడియా సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వం, భాజపాపై మండిపడ్డారు. రాహుల్ గాంధీ పట్ల అసోం సీఎం వ్యాఖ్యలపై స్పందించిన సీఎం... ఆ కామెంట్స్ సమంజసమేనా అని నిలదీశారు. రాహుల్పై అనుచిత వ్యాఖ్యల విషయాన్ని వదిలిపెట్టనన్నారు. అసోం సీఎంను భాజపా ప్రోత్సహిస్తోందా అని ప్రశ్నించారు. ఆయనపై భాజపా ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. సర్జికల్ స్ట్రయిక్స్ ఆధారాలు కేంద్రం బయటపెట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేయటంలో తప్పేమీ లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. తాను కూడా ఇప్పుడు వాటి ఆధారాలు అడుగుతున్నానని తెలిపారు. సర్జికల్ స్ట్రయిక్స్.. పొలిటికల్ స్టంట్ అని దేశంలో సగం మంది నమ్ముతున్నారని.. దాంట్లో నిజానిజాలు తెలుసుకోవాలనుకుంటున్నారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి :
cm kcr comments: భాజపా నేతలకు దమ్ముంటే నన్ను జైలుకు పంపాలి - సీఎం కేసీఆర్