Assago Industries CEO: ఏపీలో ఇథనాల్ ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటు కోసం అస్సాగో ఇండస్ట్రీస్ సంస్థ ముందుకొచ్చింది. మంగళగిరిలోని ఏపీ ఐఐసీసీ కార్యాలయంలో ఆ సంస్థ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డితో అస్సాగో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో అశిష్ గుర్నాని భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఇథనాల్ మానుఫాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను ఛైర్మన్‌కు అందజేశారు. ఏపీఐఐసీ ద్వారా భూ కేటాయింపులు సహా మౌలిక వసతులు అందిస్తే... తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు ఛైర్మన్ చందర్ ప్రకాశ్ గుర్నాని, ఎండీ అశిష్ గుర్నాని... ఏపీఐఐసీ ఛైర్మన్‌తో చర్చించారు.
Assago Industries CEO: "మౌలిక వసతులు కల్పిస్తే.. పరిశ్రమ ఏర్పాటు చేస్తాం" - మౌలిక వసతుల కల్పిస్తే ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్న సీఈవో భేటీ
Assago Industries CEO: మంగళగిరిలోని ఏపీ ఐఐసీసీ కార్యాలయంలో ఏపీ ఐఐసీసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డితో అస్సాగో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో అశిష్ గుర్నాని సమావేశమయ్యారు. ఏపీలో ఇథనాల్ ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మౌలిక వసతులు కల్పించాలని కోరారు.
పెట్టుబడుల భవిష్యత్ అంతా ఇథనాల్ తయారీపై ఉండనుందని ఏపీ ఐఐసీ ఛైర్మన్ పేర్కొన్నారు. ఇథనాల్ తయారీ ప్రక్రియ గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. పారదర్శకత, పారిశ్రామికవేత్తలకు స్నేహపూర్వకంగా మెలిగి కచ్చితమైన విధానాలు పాటించే ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఏడాదిన్నరలోగా రూ.300 కోట్ల పెట్టుబడులు ఏపీలో పెట్టనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ప్రత్యక్షంగా 90 మందికి, పరోక్షంగా 120 మందికి, మొత్తంగా 200 మందికి ఉపాధి అవకాశాలు అందించనున్నట్లు ప్రాజెక్టు నివేదిక సమర్పించారు. అందుకోసం 20 ఎకరాల భూమి అవసరమని ఛైర్మన్‌ను కోరారు.
ఇదీ చదవండి:Suspension: పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్ కేసు.. 17మంది ఉపాధ్యాయులు సస్పెన్షన్