ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

VIJAYAWADA TEMPLE: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఆషాడసారె ఉత్సవాలు..

VIJAYAWADA TEMPLE: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం సన్నిధిలో... ఆషాడమాస సారె ఉత్సవాలు వైభవంగా ప్రారంభమైయ్యాయి. కోలాటాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య తొలిసారెను వైదిక కమిటీ సభ్యులు అమ్మవారికి సమర్పించారు.

VIJAYAWADA TEMPLE
వైభవంగా ఆషాడసారె ఉత్సవాలు.. తొలిసారె సమర్పించిన వైదిక కమిటీ సభ్యులు

By

Published : Jun 30, 2022, 3:24 PM IST

వైభవంగా ఆషాడసారె ఉత్సవాలు.. తొలిసారె సమర్పించిన వైదిక కమిటీ సభ్యులు

VIJAYAWADA TEMPLE: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం సన్నిధిలో.. ఆషాడమాస సారె ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయని ఆలయ అర్చకులు తెలిపారు. తొలిసారెను వైదిక కమిటీ సభ్యులు కుటుంబసమేతంగా తరలివచ్చి అమ్మవారికి సమర్పించారు. కోలాటాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి సారెను అందజేశారు. పసుపు, కుంకుమ, చీర, రవిక, పుష్పాలు, పండ్లు తదితరాలను అమ్మవారికి సమర్పించారు. లోకశాంతి, ప్రజలందరికీ సుఖసంతోషాలు కలిగించాలని ప్రార్థించారు. జులై 28వరకు ఆషాడ సారె కార్యక్రమం కొనసాగనుంది. అమ్మవారికి ఆషాడసారె సమర్పించే ధార్మిక సంస్థలు, దేవాలయాలు, భజన మండలులు మూడు రోజులు ముందుగా ఆలయ అధికారులను సంప్రదించి తమ పేరు నమోదుచేసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details