ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ASHA WORKERS PROTEST: ఆశావర్కర్ల నిరసన.. డిమాండ్లు నెరవేర్చాలని వినతి - విజయవాడ వార్తలు

ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు నిరసనకు(ASHA WORKERS DHARNA) దిగారు. తమపై పని ఒత్తిడి తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.

ASHA WORKERS protests in ap
ASHA WORKERS protests in ap

By

Published : Nov 23, 2021, 7:10 PM IST

రాష్ట్రవ్యాప్తంగా ఆశావర్కర్ల నిరసనలు.. డిమాండ్లు నెరవేర్చాలని వినతి

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. జిల్లా కలెక్టరేట్ల వద్ద రాష్ట్ర ఆశావర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా(ASHA WORKERS PROTESTS) చేపట్టారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టిన ఆశావర్కర్లు.. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. తమకు సంబంధం లేని పనులు చేయించకూడదని.. పనిభారాన్ని తగ్గించాలని కోరారు. ఆశాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని..వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు ఇవ్వాలని విజయవాడలో ఆశావర్కర్లు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్లకార్డులు ప్రదర్శించారు. తమకు గౌరవ వేతనం అందించాలని.. అధికారుల బెదిరింపులు, వేధింపులు ఆపాలని ఆశా కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. పని భారం పెరిగి ఒత్తిడికి గురవుతున్నామని.. విజయనగరం జిల్లాలో ఆశా కార్యకర్తలు అన్నారు. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని.. లేకపోతే పోరాటం మరింత ఉద్ధృతం(ASHA WORKERS PROTEST FOR DEMANDS FULFILMENT) చేస్తామన్నారు. కొవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి పని చేశామని.. శ్రీకాకుళం జిల్లాలో ఆందోళన చేపట్టిన వారన్నారు. ఆశాల సమస్యలపై టెక్కలిలో సబ్ కలెక్టర్ వికాస్‌కు వినతిపత్రం అందజేశారు.

ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్న ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యిందని ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ నాయకురాలు మట్ల వాణి శ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తమపై పని ఒత్తిడి తగ్గించాలని, రిఫరల్ కేసులకు టీఏ, డీఏ వర్తింపజేయాలని, వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలని, రూ. 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలని, ఆశా వర్కర్ మరణిస్తే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details