Asha workers chalo collectorate: న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు కదం తొక్కారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ర్యాలీలు, దీక్షలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ ర్యాలీలను అడ్డుకుంటున్న పోలీసులు.. ఆశాలను అదుపులోకి తీసుకున్నారు.
కృష్ణా జిల్లాలో..
ఆశావర్కర్ల కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా కృష్ణా జిల్లావ్యాప్తంగా పోలీసులు విస్తృత సోదాలు నిర్వహించారు. కలెక్టరేట్ల వద్దకు ఆశాలు వెళ్లకుండా అడ్డుకున్నారు. విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారిలో ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. వాహన తనిఖీలు చేపట్టారు.
నందిగామ, గుడివాడ, తిరువూరు మండలం లక్ష్మీపురం వద్ద ఆశా కార్యకర్తలను అరెస్టు చేసి.. పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ.. పోలీస్‌స్టేషన్ల ఎదుటే ఆశాలు ధర్నా చేపట్టారు. సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలియచేయాలనుకున్న తమను అరెస్టు చేయడంపై ఆశావర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు.పోలీసుల అదుపులో ఉన్న ఆశాలను.. తెదేపా, సీఐటీయూ నాయకులు పరామర్శించారు
కర్నూలులో..
తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ.. కర్నూలు కలెక్టరేట్, నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశావర్కర్లు ధర్నా చేశారు. పని భారాన్ని తగ్గింది, 15వేల గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. పదిలక్షల గ్రూప్ ఇన్సూరెన్స్, ప్రసూతి సెలవులు, అయిదు లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. కార్యాలయాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
అనంతపురంలో..
అనంతపురం జిల్లా మడకశిర నుంచి కలెక్టరేట్ కార్యాలయానికి ఆర్టీసీ బస్సులో బయలుదేరిన ఆశా వర్కర్లను పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు.