ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మొదలైన "అసని" దండయాత్ర.. కాసేపట్లో తీరాన్ని తాకే అవకాశం - భారీ తుపానుగా అసని

అసని తుపాను తాజా వార్తలు
asani cyclone latest updates

By

Published : May 10, 2022, 8:02 PM IST

Updated : May 11, 2022, 5:57 AM IST

05:44 May 11

మచిలీపట్నంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం

కృష్ణా జిల్లా: అసని తుపాను ప్రభావంతో మచిలీపట్నంలో వర్షం
మచిలీపట్నంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం
అప్రమత్తమై విద్యుత్‌ సరఫరా నిలిపివేసిన అధికారులు

05:27 May 11

కాసేపట్లో మచిలీపట్నం వద్ద భూభాగంపైకి వచ్చే అవకాశం

  • బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుపాను 'అసని'
  • మచిలీపట్నానికి ఆగ్నేయంగా 90 కి.మీ దూరంలో కేంద్రీకృతం
  • కాసేపట్లో మచిలీపట్నం వద్ద భూభాగంపైకి వచ్చే అవకాశం
  • అనంతరం తీరం వెంబడి దిశ మార్చుకోనున్న తుపాను అసని
  • యానాం, కాకినాడ మీదుగా తుపాను పయనించే సూచన
  • రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనున్న తుపాను
  • తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్ష సూచన
  • కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో. జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్ష సూచన
  • ఏలూరు, కోనసీమ, విశాఖ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్ష సూచన
  • తుపాను దృష్ట్యా తీర ప్రాంతాల్లో 95-105 కి.మీ వేగంతో ఈదురుగాలులు

02:26 May 11

అసని తుపాను .. అప్రమత్తమైన అధికార యంత్రాంగం

విశాఖ

  • విశాఖ: తుపాను దృష్ట్యా అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం
  • తుపాను ప్రభావిత మండలాలకు ప్రత్యేక అధికారులుగా డిప్యూటీ కలెక్టర్లు
  • లోతట్టు ప్రాంతాల్లో తుపాను సమాచారాన్ని మైకుల ద్వారా తెలియజేస్తున్న సిబ్బంది
  • తీవ్ర తుపాను దృష్ట్యా అప్రమత్తమైన వివిధ శాఖల సిబ్బంది
  • ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్, నేవీ, కోస్ట్‌గార్డు బృందాలు సిద్ధం
  • విశాఖ కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 1800 425 00002
  • కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు: 0891-2590100, 2590102, 2560820
  • విశాఖ జీవీఎంసీ కార్యాలయంలో హెల్ప్ లైన్ నంబర్: 1800 4250 0009
  • విశాఖ జీవీఎంసీ కార్యాలయంలో హెల్ప్ లైన్ నంబర్: 0891 2869106
  • తుపాను సహాయ కేంద్రాల్లో ఆహార పదార్థాలు, తాగునీరు, జనరేటర్ సిద్ధం
  • విశాఖ బీచ్‌ సందర్శనకు పర్యాటకులకు అనుమతి నిరాకరణ
  • పర్యాటకులు రాకుండా విశాఖ బీచ్‌ వద్ద పోలీసుల పహారా
  • విశాఖ ఈపీడీసీఎల్ పరిధిలో రెస్క్యూ మేనేజ్‌మెంట్ బృందం సిద్ధం
  • వాల్తేర్ పరిధిలో డీఆర్‌ఎం ఆధ్వర్యంలో రెస్క్యూ మేనేజ్‌మెంట్ బృందం సిద్ధం
  • విశాఖ తూర్పు నావికాదళంలో సహాయక చర్యల కోసం సిద్ధం
  • విశాఖ కోస్ట్‌గార్డ్ పరిధిలో నౌకలు, సిబ్బంది సిద్ధం

కాకినాడ

  • తుపాను హెచ్చరికలతో అప్రమత్తమైన కాకినాడ జిల్లా యంత్రాంగం
  • కాకినాడ క‌లెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు
  • కాకినాడ, పెద్దాపురం ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లు
  • జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్‌ 1800-425-3077
  • కాకినాడ ఆర్డీవో కార్యాలయం నంబర్‌ 0884-2368100 పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం నంబర్‌ 96036 63327
  • తుపాను ముప్పు ముగిసే వరకూ అందుబాటులో కంట్రోల్‌ రూమ్‌లు
  • స‌ముద్ర తీర మండ‌ల కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు
  • కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ నం.1800 425 0325

కోనసీమ జిల్లా

  • కోనసీమ జిల్లా: తుపాను దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేసిన కలెక్టర్
  • అంతర్వేది, ఓడలరేవు, కాట్రేనికోన తీరాలపై తీవ్ర తుపాను ప్రభావం

కోనసీమ జిల్లావ్యాప్తంగా భీకర గాలులు, వర్షాలు

  • అమలాపురం కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ నం. 0885 6293104
  • సముద్ర తీర ప్రాంత మండలాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు

బాపట్ల

  • తుపాను దృష్ట్యా బాపట్ల కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు
  • నిజాంపట్నం హార్బర్‌లో 8వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ
  • బాపట్ల కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేసిన అధికారులు
  • బాపట్ల జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు
  • బాపట్ల జిల్లా: సముద్రతీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటన
  • బాపట్ల జిల్లా: చేపలవేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరిక
  • బాపట్ల జిల్లా: తుపాను దృష్ట్యా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు
  • కంట్రోల్ రూమ్ నెంబర్లు 8712655878, 8712655881, 8712655918

నెల్లూరు

  • తుపాను దృష్ట్యా తీర ప్రాంతాల్లో ప్రత్యేక అధికారుల నియామకం
  • తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్ట నివారణకు కలెక్టర్‌ చర్యలు
  • నెల్లూరు: తుపాను పరిస్థితులను పర్యవేక్షిస్తున్న కలెక్టర్, ఎస్పీ

శ్రీకాకుళం

  • శ్రీకాకుళం: తుపాను దృష్ట్యా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన కలెక్టర్
  • మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ
  • కలెక్టరేట్‌తో పాటు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు
  • శ్రీకాకుళం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నంబర్ 08942-240557

విజయనగరం

  • విజయనగరం: తుపాను దృష్ట్యా గ్రామ సచివాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు
  • విజయనగరం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నం. 08922-236947
  • విజయనగరం ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నం. 08922-276888
  • చీపురుపల్లి ఆర్డీవో కార్యాలయంలో నంబర్లు 94407 17534, 08944-247288
  • భోగాపురం తహశీల్దార్ కార్యాలయంలో నంబర్లు 80744 00947, 70367 63036

00:01 May 11

తుపాను దృష్ట్యా.. 37 రైళ్లు రద్దు

  • తుపాను దృష్ట్యా 37 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
  • విజయవాడ-మచిలీపట్నం, మచిలీపట్నం-విజయవాడ రైళ్లు రద్దు
  • విజయవాడ-నర్సాపూర్, నర్సాపూర్-విజయవాడ రైళ్లు రద్దు
  • నర్సాపూర్-నిడదవోలు, నిడదవోలు-నర్సాపూర్ రైళ్లు రద్దు
  • భీమవరం జంక్షన్-నిడదవోలు, మచిలీపట్నం-విజయవాడ రైళ్లు రద్దు
  • విజయవాడ-భీమవరం జంక్షన్ రైలు రద్దు చేసిన రైల్వే శాఖ
  • కొన్ని రైళ్లు రీ-షెడ్యూల్ చేసిన రైల్వేశాఖ
  • అవనిగడ్డ నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన వర్షం
  • తుపాను వల్ల హంసలదీవి సముద్రం వద్ద ఎగసిపడుతున్న అలలు
  • హంసలదీవి బీచ్ గేట్లు మూసివేసిన మెరైన్ పోలీసులు
  • 6 మండలాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసిన అధికారులు

20:32 May 10

బాపట్ల కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

  • బాపట్ల జిల్లా: అసని తుపాను దృష్ట్యా అధికారుల అప్రమత్తం
  • నిజాంపట్నం హార్బర్‌లో 8వ నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ
  • బాపట్ల కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేసిన అధికారులు
  • బాపట్ల జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు
  • బాపట్ల జిల్లా: సముద్రతీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటన
  • బాపట్ల జిల్లా: చేపలవేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరిక
  • బాపట్ల జిల్లా అసని తుపాను పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
  • తుపాను ప్రభావంతో ప్రజలు ఇబ్బంది పడకుండా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
  • కంట్రోల్ రూమ్ నంబర్‌ 8712655878, 8712655881, 8712655918

19:52 May 10

కడపలో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం

  • కడపలో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం
  • భారీవర్షం, గాలుల వల్ల కడపలో నిలిచిన విద్యుత్ సరఫరా

19:51 May 10

విశాఖ: తుపాను సహాయ చర్యల కోసం నావికాదళాల సమాయత్తం

  • విశాఖ: తుపాను సహాయ చర్యల కోసం నావికాదళాల సమాయత్తం
  • ఏపీ, ఒడిశా ఉన్నతాధికారులతో నిరంతర సంప్రదింపులు
  • 19 వరద సహాయ బృందాలు, 6 డైవింగ్ బృందాలు జెమినీ బోట్లతో సిద్ధం
  • 5 ఇండియన్ నేవీ నౌకలు సహాయ సామగ్రితో సిద్ధం చేసిన అధికారులు
  • బాధితులను రక్షించేందుకు ఐఎన్‌ఎస్ డేగ, ఐఎన్ఎస్ రజాలి వద్ద అప్రమత్తం

19:50 May 10

అసని తుపానుపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమీక్ష

  • అసని తుపానుపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమీక్ష
  • ఏపీ, ఒడిశాలోని వివిధశాఖల అధికారులతో హోంశాఖ కార్యదర్శి సమీక్ష
  • కృష్ణా, కాకినాడ, తూ.గో., ప.గో., విశాఖ జిల్లాలపై తుపాను ప్రభావం: ఐఎండీ
  • తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో 75-95 కి.మీ. వేగంతో గాలులు
  • ఒడిశా తీరంలో 45-65 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం
  • మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలన్న ఐఎండీ అధికారులు

19:50 May 10

ఏపీ, ఒడిశా, బంగాల్‌లో 50 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తం

  • ఏపీ, ఒడిశా, బంగాల్‌లో 50 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తం
  • రాష్ట్రంలోని తీరప్రాంతాల్లో 9 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధం
  • తుపాను తీరం దాటే వేళ తీసుకోవాల్సిన చర్యలపై ఎన్డీఆర్ఎఫ్ డ్రైవ్‌
  • తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఎన్డీఆర్ఎఫ్
  • ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్న ఎన్డీఆర్ఎఫ్
  • తుపానును నిశితంగా పరిశీలిస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్ ప్రధాన కార్యాలయం

19:49 May 10

కృష్ణా: 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం: కలెక్టర్‌

  • కృష్ణా: తుపాను తీరం దాటేటప్పుడు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా
  • 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం: కలెక్టర్‌
  • అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాం: కలెక్టర్‌
  • ప్రభుత్వ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నాం: కలెక్టర్‌

19:48 May 10

నెల్లూరు జిల్లాలో భారీ ఈదురు గాలులతో వర్షం

  • నెల్లూరు జిల్లాలో భారీ ఈదురు గాలులతో వర్షం
  • కావలి, కందుకూరులో భారీ వర్షంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం

19:47 May 10

అసని తుపాను వల్ల మచిలీపట్నంలో ఈదురుగాలులు

  • అసని తుపాను వల్ల మచిలీపట్నంలో ఈదురుగాలులు
  • ముందుజాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపిన అధికారులు
  • మచిలీపట్నం దగ్గర తుపాను తీరం దాటుతుందని అంచనా
  • కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌ సమీక్ష
  • తుపాను దృష్ట్యా జిల్లా అధికారులు, తహశీల్దార్లతో చర్చ
  • తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలు వివరించిన కలెక్టర్

19:46 May 10

తుపాను దృష్ట్యా తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి

  • తుపాను దృష్ట్యా తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి
  • విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్‌తో మాట్లాడిన హోంమంత్రి తానేటి వనిత
  • ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ను సిద్ధం చేశామన్న విపత్తుల సంస్థ డైరెక్టర్
  • తుపాను దృష్ట్యా అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తం కావాలి: హోంమంత్రి
  • మత్స్యకారులను వేటకు వెళ్లకుండా చూడాలన్న హోంమంత్రి తానేటి వనిత
  • తీరప్రాంత ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలి: హోంమంత్రి

19:32 May 10

తీరం వైపు దూసుకొస్తున్న తుపాను

  • దిశ మార్చుకున్న తీవ్ర తుపాను 'అసని'
  • రేపు సాయంత్రంలోగా తీరం దాటే అవకాశం
  • మచిలీపట్నం సమీపంలో తీరం దాటే సూచన
  • తీరాన్ని తాకిన తర్వాత మళ్లీ విశాఖ వద్ద సముద్రంలోకి ప్రవేశిస్తుందని అంచనా
  • రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
  • విశాఖ వచ్చే అన్ని విమానాలు రేపు కూడా రద్దు
Last Updated : May 11, 2022, 5:57 AM IST

ABOUT THE AUTHOR

...view details