విజయవాడలోని రెడ్‌జోన్ ప్రాంతాల్లో డీసీపీ విక్రాంత్ పాటిల్ విస్తృతంగా పర్యటించారు. సింగ్ నగర్, డాబా కోట్ల సెంటర్, పాయకాపురం రెడ్‌జోన్ ప్రాంతాల్లో పోలీస్ వాహనాలతో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. దీనిని డీసీపీ జెండా ఊపి ప్రారంభించారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలో 200కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని డీసీపీ తెలిపారు. రెడ్‌జోన్ ప్రాంత ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని ప్రజలు బయటకి రావద్దని సూచించారు. విధి నిర్వహణలో భాగంగా ఎంతో మందికి, అలాగే నగరంలో బాధ్యతారహితంగా ఉన్న వారికి కరోనా సోకిందన్నారు. విజయవాడలోనే కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయని తెలిపారు. ఎవరూ బయటకు రాకూడదని.. అనవసరంగా బయటకు వస్తే ఊరుకోమని హెచ్చరించారు. కరోనా కేసులు పెరిగే కొద్దీ పోలీసుల చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. రెడ్‌జోన్ ప్రాంతంలో డ్రోన్ల సహయంతో కదలికలు పర్యవేక్షిస్తున్నామని డీసీపీ తెలిపారు.
'కరోనా కేసులు పెరిగే కొద్దీ చర్యలు తీవ్రతరం' - విజయవాడలో రెడ్జోన్లు
విజయవాడలో కరోనా కేసులు పెరుగుతున్నాయని డీసీపీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వాలని సూచించారు. కరోనా కేసులు పెరిగే కొద్దీ పోలీసుల చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు.
dcp vikranth patil Visit vijayawada