ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆంధ్రాతో అరుణ్ జైట్లీ అనుబంధం - jately

కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీకి ఆంధ్రప్రదేశ్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది... మరీ ముఖ్యంగా అమరావతి పట్ల ప్రత్యేక ఆసక్తిని కనబరిచారు. రాష్ట్ర విభజన సమయంలో రాజ్యసభలో విపక్షనేత హోదాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలు కాపాడేందుకు బాసటగా నిలిచారు. భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ఆర్ధికమంత్రి హోదాలోనూ రాష్ట్రానికి అండగా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్​తో జైట్లీకున్న బంధమేమిటి...?

By

Published : Aug 25, 2019, 6:31 AM IST

ఆంధ్రప్రదేశ్​తో జైట్లీకున్న బంధమేమిటి...?

కేంద్ర మాజీ మంత్రి అరుణ్​ జైట్లీకి ఆంధ్రప్రదేశ్​ విభజన ముందు నుంచి ప్రత్యేక అనుబంధం ఉంది... రాష్ట్ర విభజన బిల్లుపై పార్లమెంటు చర్చా సమయంలోనూ ఆంధ్రప్రదేశ్‌ పట్ల సానుకూల దృక్పథంతోనే ఉన్నారు. 2014లో విభజన బిల్లుపై రాజ్యసభ చర్చ సందర్భంగా అప్పటి విపక్షనేతగా ఉన్న జైట్లీ... మరో సీనియర్‌ నేత, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో కలిసి ఏపీ ప్రయోజనాలు కాపాడేందుకు గట్టిగా పోరాడారు. అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ఒత్తిడి తీసుకొచ్చి... రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ప్రకటించేలా చేశారు.

కేంద్రంలో ఏన్డీయే... రాష్ట్రంలో తెదేపా ప్రభుత్వాలు అధికారంలో ఉన్న సమయంలో... ఎంపీలు, మంత్రులు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఏ అంశంపై దిల్లీ వెళ్లినా వెంకయ్యతోపాటు జైట్లీని కలిసి సహకారం కోరేవారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా హామీ అమలు కోసం పట్టుబడుతున్న తరుణంలో.... 14వ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యంకాదని కచ్చితంగా చెప్పినందున... ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారు. ప్రత్యేక హోదాతో సమానమైన అన్ని ప్రయోజనాలు ఇస్తామని... పోలవరం ప్రాజెక్టుకు అయ్యే మొత్తం ఖర్చు కేంద్రమే భరిస్తుందని... ఏపీకి ప్రత్యేక పన్ను రాయితీలు ఇస్తామని ఆయన పేర్కొన్నారు.

2016 అక్టోబరు 28న అమరావతిలో కీలకమైన ప్రభుత్వ భవనాల సముదాయానికి శంకుస్థాపన కార్యక్రమంలో జైట్లీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అమరావతి ఒక అద్భుత నగరంగా రూపుదిద్దుకుంటుందని ఆకాంక్షను వ్యక్తం చేశారు. రాజధాని రైతులకు క్యాపిటల్‌ గెయిన్స్‌ టాక్స్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఈ సభలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కోరగా... అందుకనుగుణంగానే 2017-18 బడ్జెట్‌ ప్రసంగంలో జైట్లీ రాజధాని ప్రాంత రైతులకు ఊరట కలిగించే ప్రకటన చేశారు.

ABOUT THE AUTHOR

...view details